భారత్‌లో తొలిసారి బ్లాక్‌బాక్స్‌ డీకోడింగ్‌

First black box decoding in India;

Update: 2025-06-14 06:11 GMT

భారత దేశంలో తొలిసారి బ్లాక్‌ బాక్స్‌ డీకోడింగ్‌ ప్రక్రియ చేపడుతున్నారు. విమాన ప్రమాదాలు జరిగిన సమయంలో అవరసమైన పూర్తిస్థాయి దర్యాప్తుల కోసం ఈ యేడాది ఏప్రిల్‌లోనే భారతదేశంలో బ్లాక్‌ బాక్స్‌ ల్యాబ్‌ ప్రారంభమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన ఈ ల్యాబ్‌ను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించారు. ఇప్పుడు ఈ ల్యాబ్‌లోనే ఫస్ట్ బ్లాక్‌బాక్స్‌ను విశ్లేషించే ప్రక్రియ కొనసాగుతోంది.

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన సంఘటనలో మృతుల సంఖ్య 300 సమీపించింది. అత్యంత ఘోర ప్రమాదంగా పరిగణిస్తోన్న ఈ ప్రమాద సంఘటనపై బ్లాక్‌ బాక్స్‌పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. విమాన ప్రమాదాలపై దర్యాప్తు చేపడుతున్న క్రమంలో కీలక ఆధారాలు లభించాలంటే బ్లాక్‌బాక్స్‌ను డీకోడ్‌ చేయాల్సిందే. చూడ్డానికి ఆరెంజ్‌ కలర్‌లో ఉండే ఈ బ్లాక్‌బాక్స్‌ విమానాల్లో అత్యంత కీలకమైన పరికరం. ప్రమాదాలకు ఖచ్చితమైన కారణం కనుగొనేందుకు సహకరించే ఏకైక పార్ట్‌.

సాధారణంగా కమర్షియల్‌ విమానాలన్నింటిలోనూ రెండు బ్లాక్‌ బాక్స్‌లు ఉంటాయి. వాటిలో ఒకటి విమానానికి ముందు భాగంలో ఉంటే.. మరొక బ్లాక్‌బాక్స్‌ విమానం వెనుక భాగంలో ఉంటుంది. ముందు భాగంలో ఉండే మొదటి బ్లాక్‌బాక్స్‌లో ప్లైట్ డేటా, విమానం వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు, కాక్‌పిట్ వాయిస్, పైలట్ల సంభాషణలు, విమానంలోని ఇతర అసాధారణ శబ్దాలను రికార్డ్ చేస్తుంది. విమానం వెనుక భాగంలో ఉండే రెండో బ్లాక్‌బాక్స్‌.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో పైలట్ల కమ్యూనికేషన్, విమానంలోని ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తుంది. దీంతో.. ఈ రెండు బ్లాక్‌ బాక్సుల ద్వారా డేటాను విశ్లేషించి ప్రమాదానికి ముందు విమానంలో ఏం జరిగిందో.. పైలట్ల మధ్య ఏమేం సంభాషణ జరిగిందో, విమాన భద్రతకు సంబంధించిన ఏయే వ్యవస్థలు ఎలా పనిచేశాయో బ్లాక్‌బాక్స్‌లు డీకోడ్‌ చేయడం ద్వారా దర్యాప్తు చేస్తున్న అధికారులు తెలుసుకుంటారు. బ్లాక్ బాక్స్ ప్రమాదానికి దారితీసిన సంఘటనలను పరిష్కరించడానికి దర్యాప్తులో ఎంతగానో సహాయపడుతుంది. కాక్‌పిట్, విమాన వ్యవస్థలలో ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందో అందరికీ చెబుతుంది. బ్లాక్‌బాక్స్‌ అనేది ఒకరకంగా క్రిమినల్ కేసుల్లో డీఎన్‌ఏ ఎవిడెన్స్‌ మాదిరిగా పనిచేస్తుంది. ప్రమాదానికి ఖచ్చితమైన, నిష్పాక్షికమైన ఎవిడెన్స్‌ను దర్యాప్తు అధికారులకు అందజేస్తుంది. దీంతో... ఇప్పుడు అహ్మదాబాద్‌ విమాన ప్రమాదానికి సంబంధించి కూడా దర్యాప్తు అధికారులు ఆ పనిలోనే బిజీగా ఉన్నారు.

ఫ్లైట్ రికార్డర్, బ్లాక్ బాక్స్ 1950 దశాబ్దంలో రూపొందించారు. బ్లాక్ బాక్స్‌ను ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త డేవిడ్ రోనాల్డ్ డి. మే వారెన్ కనుగొన్నారు పేలుళ్లు, అగ్ని, నీటి పీడనం, హై-స్పీడ్ క్రాష్‌లను కూడా తట్టుకునేలా బ్లాక్‌బాక్స్‌లను తయీరు చేస్తారు. ఇప్పుడు, అహ్మదాబాద్‌లో విమానం కూలిపోయిన డాక్టర్ల హాస్టల్ పైకప్పుపై ఈ బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది సహాయంతో, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం బ్లాక్ బాక్స్‌ను గుర్తించిందని అంటున్నారు.



Tags:    

Similar News