TVK Clarifies: విజయ్‌కు మొదలైన తలనొప్పులు.. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు క్యాబినెట్‌లో చోటు కేవలం ఊహాగానాలు: టీవీకే స్పష్టీకరణ

అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు క్యాబినెట్‌లో చోటు కేవలం ఊహాగానాలు: టీవీకే స్పష్టీకరణ

Update: 2026-05-20 11:43 GMT

TVK Clarifies: తమిళనాడులో టీవీకే (తమిళగ వెట్రి కజగం) చీఫ్‌ సినీ నటుడు విజయ్ సారథ్యంలోని ప్రభుత్వానికి మొదటి తలనొప్పులు మొదలయ్యాయి. అన్నాడీఎంకే (AIADMK) తిరుగుబాటు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేర్చుకుంటారనే వార్తలు వ్యాపించడంతో మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో టీవీకే తరపున స్పష్టత ఇచ్చారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లు సాధించి, కాంగ్రెస్, వీసీకే (విసికె), లెఫ్ట్ పార్టీలు (సీపీఐ, సీపీఎం), ఐయూఎంఎల్‌ల మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత బలపరీక్ష సమయంలో అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వానికి బలం పెరిగి 144కి చేరింది.

ఈ క్రమంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు క్యాబినెట్‌లో బెర్త్‌లు ఇస్తారనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. దీనిపై వీసీకే నేత తిరుమావళవన్ స్పందిస్తూ, “ఆ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే మా మద్దతుపై పునరాలోచించాల్సి వస్తుంది” అని హెచ్చరించారు. వామపక్షాల నుంచి కూడా ఇలాంటి వ్యతిరేకత వచ్చింది. అన్నాడీఎంకే ఏ వర్గాన్నైనా ప్రభుత్వంలో చేర్చుకోవడం ప్రజల తీర్పుకు విరుద్ధమని మిత్రపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో తమిళనాడు మంత్రి అధవ్ అర్జున స్పందించారు. “మిత్రపక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు క్యాబినెట్‌లో చేరతారనే వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే” అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వం మిత్రపక్షాల మద్దతుతో స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతు మరియు క్యాబినెట్ ఊహాగానాలు రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.

Tags:    

Similar News