Major Shock for Mamata: మమతకు భారీ షాక్‌.. ఎన్‌డీయే వైపు 20 మంది టీఎంసీ ఎంపీలు!

ఎన్‌డీయే వైపు 20 మంది టీఎంసీ ఎంపీలు!

Update: 2026-06-08 14:03 GMT

Major Shock for Mamata: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో తీవ్ర సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభలోని 20 మంది టీఎంసీ ఎంపీలు ఎన్‌డీయే కూటమికి మద్దతు ప్రకటించారు.

ఎంపీ కకోలీ ఘోష్ దాస్తిదార్ నేతృత్వంలో ఈ రెబల్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసి తమ నిర్ణయం తెలిపారు. లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్‌గా ఉన్న కకోలీ ఘోష్ తోటి ఎంపీలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

“ప్రజల తీర్పును గౌరవిస్తూ, వారు ఎన్నుకున్న ప్రభుత్వంతో కలిసి పని చేయాలి” అని తమ బృందం నిర్ణయించిందని ఆమె వివరించారు. ఈ చీలికపై టీఎంసీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ పరిణామంతో లోక్‌సభలో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి కేవలం 8 మంది ఎంపీలు మాత్రమే మిగిలారు.

ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ శాసనసభలో ఇప్పటికే టీఎంసీ ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయారు. రితబ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మందికి పైగా తిరుగుబాటు ఎమ్మెల్యేలు తామే నిజమైన టీఎంసీ వర్గమని ప్రకటించుకున్నారు. మరోవైపు, టీఎంసీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పార్టీని వీడి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఈ వరుస షాకులు మమతా బెనర్జీ నాయకత్వానికి తీవ్ర ఎదురుదెబ్బగా మారాయి.

Tags:    

Similar News