Rahul Gandhi’s Sharp Challenge: మోదీకి అమెరికా ఒప్పందం రద్దు చేసే ధైర్యం లేదు: రాహుల్ గాంధీ సవాల్

రద్దు చేసే ధైర్యం లేదు: రాహుల్ గాంధీ సవాల్

Update: 2026-02-25 04:57 GMT

Rahul Gandhi’s Sharp Challenge: అమెరికా ఒత్తిడి వల్లనే భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని, ప్రధాని నరేంద్ర మోదీకి నిజంగా ధైర్యం ఉంటే ఆ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర సవాల్ విసిరారు. మోదీ పిరికితనం చూపిస్తున్నారని, అమెరికాకు లొంగిపోయి ఒప్పందంపై సంతకం చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.

మంగళవారం భోపాల్‌లో జరిగిన కిసాన్ ర్యాలీలో రాహుల్ గాంధీ, ఖర్గేలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందం భారత రైతుల గుండెల్లో గుచ్చిన బాణంలా ఉందని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, ఇప్పుడైనా మోదీ ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఎప్‌స్టీన్ ఫైళ్లు బయటపడటం, గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నడవడం వంటి కారణాల వల్ల మోదీ అమెరికాతో ఒప్పందాన్ని రద్దు చేసుకోలేకపోతున్నారని రాహుల్ ఆరోపించారు. అదానీపై అమెరికాలో నడుస్తున్న కేసు నిజానికి మోదీపైనే ఎక్కుపెట్టినదని, ఈ ఒత్తిడిని తట్టుకోలేకే ప్రధాని వాణిజ్య ఒప్పందానికి అంగీకరించారని విమర్శలు గుప్పించారు.

అలాగే, చైనా ట్యాంకులు సరిహద్దుల దగ్గరకు వస్తున్నాయని హెచ్చరించినా మోదీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, మాజీ సైన్యాధిపతి నరవణె తన పుస్తకంలో వెల్లడించారని రాహుల్ పేర్కొన్నారు.

ఖర్గే మాట్లాడుతూ, మోదీ పాలనలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయని, రైతులను బానిసలుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్రంగా ఖండించారు.

Tags:    

Similar News