ఘనంగా రక్షా బంధన్ వేడుకలు
దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి సంబరాలు;
దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాఠశాల చిన్నారులతో రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు. రాఖీ వేడుకల్లో మహిళా కమిషన్ చైర్మన్ నేరళ్ల శారద పాల్గొన్నారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఇంట్లో జరిగిన రాఖీ వేడుకల్లో పార్టీ నాయకురాలు రాణీ రుద్రమ దేవి రాఖీ కట్టారు.
పిసిసి అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ మహిళా నేతలు, బంధువుల రాఖీలు కట్టి వేడుకలు జరుపుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కి రాఖీ కడుతున్న అక్క లక్ష్మీబాయి చిత్రంలో అక్క జయమ్మ చెల్లెలు వినోదమ్మ, భార్య శోభమ్మ తదితరులు ఉన్నారు.
మాజీమంత్రి హరీశ్ రావుకు బీఆర్ఎస్ మహిళా నేతలు సత్యవతి రాథోడ్, తుల ఉమ రాఖీ కట్టారు.
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పార్టీ మహిళా నేతలు రాఖీలు కట్టారు.