Narendra Modi: మహిళల గౌరవానికి ప్రాధాన్యం – మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోడీ

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోడీ

Update: 2026-04-16 05:32 GMT

Narendra Modi: తల్లులు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి మనం ఇచ్చే గౌరవం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మహిళా సాధికారత దిశగా చారిత్రక అడుగు వేసేందుకు దేశం సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు.

నేటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్‌లో జరగనున్న ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ (X) వేదికగా స్పందించారు.

‘‘ఈరోజు నుంచి పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మహిళా సాధికారత దిశగా మరో చారిత్రక అడుగు వేసేందుకు మన దేశం సిద్ధంగా ఉంది. సోదరీమణులు, తల్లులపై మనం చూపించే గౌరవమే.. దేశానికి మనమిచ్చే గౌరవం. ఇదే స్ఫూర్తితో, దృఢ నిశ్చయంతో మనమంతా ముందుకుసాగుదాం’’ అని మోదీ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సంబంధిత బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఈ మూడు బిల్లులపై చర్చించి ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది. దీనికోసం బడ్జెట్ సమావేశాలను పొడిగించింది.

మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణం అమలు చేసేందుకు అధికార, విపక్ష పార్టీలు సమ్మతం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ చారిత్రక బిల్లు ద్వారా మహిళలకు రాజకీయ రంగంలో మరింత సాధికారత వస్తుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News