Arvind Kejriwal: కేజ్రీవాల్ ఇన్‌స్టా ఖాతాపై ఆంక్షలు.. మెటా సంస్థపై తీవ్ర ఆగ్రహం
మెటా సంస్థపై తీవ్ర ఆగ్రహం
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై ఆంక్షలు విధించినట్లు ఆరోపించారు. మెటా ఇండియా కార్యాలయాన్ని పలుమార్లు సంప్రదించినా స్పష్టమైన సమాధానం రాలేదని ఆయన మండిపడ్డారు. ఈ విషయమై ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
‘‘కేవలం భారత్‌లోనే నా ఇన్‌స్టా ఖాతాకు అంక్షలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్ని ఈ-మెయిల్స్ పంపినా సమాధానం రావడం లేదు. ఆంక్షలు ఎలా తొలగుతాయో ఎవరూ చెప్పడం లేదు. ఈ సేవలు చాలా చెత్తగా ఉన్నాయి. ప్రధాని ముందు మెటా తలవొంచింది’’ అని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఈ20 పెట్రోల్ వివాదం నేపథ్యంలో తన పోస్టులను నియంత్రించేందుకు మెటా ప్రయత్నిస్తోందని కూడా ఆయన అన్నారు. ఈ ఆరోపణలపై మెటా సంస్థ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను కొద్దిసేపు తొలగించిన వ్యవహారంలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే.