Third Phase of SIR Process Begins: మూడో దశ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ: 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదలు

16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదలు

Update: 2026-05-14 13:42 GMT

ఏపీ, తెలంగాణలో షెడ్యూల్ వివరాలు.. ఇంటింటి సర్వే, శిక్షణ తేదీలు ప్రకటన

Third Phase of SIR Process Begins: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమానికి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ అమలు చేయనుంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, హరియాణా, ఝార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాల్లో ఈ సవరణ జరగనుంది. ఈ దశలో 3.94 లక్షలకు పైగా బూత్ స్థాయి అధికారులు 36.73 కోట్ల మంది ఓటర్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరించనున్నారు. డిసెంబర్ 23న త్రిపురలో ఈ దశ ముగిసే అవకాశం ఉంది.

ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలు, పౌరులు SIR ప్రక్రియకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేసింది. దీని ద్వారా చనిపోయినవారు, మారిన చిరునామాలు, డూప్లికేట్ పేర్లు తొలగించి ఓటర్ల జాబితాను సమగ్రంగా, ఖచ్చితంగా తీర్చిదిద్దనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్:

జూన్ 5 నుంచి 14 వరకు: బూత్ స్థాయి సిబ్బందికి శిక్షణ.

జూన్ 15 నుంచి జులై 14 వరకు: ఇంటింటి సర్వే, వివరాల సేకరణ.

జులై 21: ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన.

జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు: అభ్యంతరాల స్వీకరణ.

సెప్టెంబర్ 22: తుది ఓటర్ల జాబితా ప్రకటన.

తెలంగాణలో షెడ్యూల్:

జూన్ 15 నుంచి 24 వరకు: సిబ్బందికి శిక్షణ.

జూన్ 25 నుంచి జులై 24 వరకు: ఇంటింటి సర్వే.

జులై 31: ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన.

జులై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు: అభ్యంతరాల స్వీకరణ.

అక్టోబర్ 1: తుది ఓటర్ల జాబితా ప్రకటన.

ఈ ప్రక్రియలో ఓటర్లు తమ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైతే అభ్యంతరాలు సమర్పించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఇది రాబోయే ఎన్నికలకు స్వచ్ఛమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితా అందించడంలో కీలకం అని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News