జూన్ 29 నుంచి జులై 5 వరకు వారం రోజుల రాశి ఫలాలు

This week's horoscope results;

Update: 2025-06-28 11:23 GMT



మేషం: మేష రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాల పట్ల జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకపోవచ్చు. సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా నూతన కార్యక్రమం ప్రారంభించే ముందు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తున్నప్పటికీ చేపట్టిన పనులు నిరాటంకంగా సాగుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొన్ని చేదు అనుభవాలు ఎదురు అవుతాయి. వివాహ విషయంలో కొంతకాలం ఆగి వెళ్లడం అనేది చెప్పదగిన విషయం. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. సహోదర సోదరీమణుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి నువ్వుల నూనెతో శనికి దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు తెలుపు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ ఒత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి.



వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి ఉద్యోగాల పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. వ్యాపారం పరంగా లాభాలు బాగుంటాయి. అయితే వచ్చిన ధనం కంటే కూడా ఖర్చులే అధికంగా ఉంటాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. నూతన పెట్టుబడులు పెట్టకుండా పొదుపు పైనే దృష్టి పెట్టండి. తల్లిదండ్రుల

ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించలేదన్న మనోవేదన ఎక్కువగా ఉంటుంది. సహ ఉద్యోగులతో కలిసి మెలిసి ఉండటం అనేది చెప్పదగిన విషయం. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనుకూలమైన సమయం కాదు. కంటికి సంబంధించి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే

సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు బ్లూ.



మిథునం: మిధున రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా లేదు. వ్యాపార పరంగా ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలిగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి నిత్యవసర సరుకులు అమ్మేవారికి లాభాలు బాగుంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు ఎల్లో.

  


కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం వేచి చూసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్లడం మంచిది. నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. లోన్లకు దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా లేదు. కోర్టు వివాదాలు తీరుతాయి. నూతన గృహ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతాయి. ప్రతిరోజు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. విద్యార్థిని విద్యార్థులకు విదేశీ విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహానికి సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా బాగుంది. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం చదవండి సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు ఎరుపు.

 


సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. కోపాన్ని

అధిగమించాలి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికం ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని పఠించండి. ప్రతిరోజు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సినిమా రంగంలో ఉన్న వారికి అవకాశాలు బాగుంటాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.

 


కన్య: కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి సంభందిత వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలు పాల్గొంటారు. నిరుద్యోగులకు

నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్.

 


తుల: తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. నూతన స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి లాభాలు బాగుంటాయి. సంఘ సేవలో పాల్గొంటారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని

సంపాదిస్తారు. జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండండి. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. సౌర కంకణం చేతికి ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రే.

 


వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. రిజిస్ట్రేషన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో సమయానుకూలంగా నిర్ణయాలు అమలు చెయ్యలేరు. మీలో ఉన్న ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరమైన వ్యవహారాలు ఆశించినరీతిగా ఉండవు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. కుటుంబ పరంగా చికాకులు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు

మరింత లాభసాటిగా సాగుతాయి. ఉన్నతాధికారులతో అలోచించి మాట్లాడటం మంచిది. ఎసిడిటీ గ్యాస్ అజిత్ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంతాల నుండి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. హోటల్ వ్యాపారం లాభాల బాటలో ఉంటుంది. ప్రతిరోజు కూడా

జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు మెరున్.

 


ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, హోటల్ వ్యాపారస్తులకు, వైద్య వృత్తిలో ఉన్నవారికి, వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు చేసే వారికి ఈ వారం లాభాలు బాగున్నాయని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తున్నప్పటికీ చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగం మారవలసిన పరిస్థితి గోచరిస్తుంది. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మనో ధైర్యం కలిగి ఉంటారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ధనమే అన్నిటికి మూలం అని గ్రహిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు.

 


మకరం: మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి పనులు నిదానంగా సాగుతాయి. వివాహం కాని వారికి వివాహ విషయంలో కొంత జాప్యం ఏర్పడుతుంది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వ పరంగా

రావలసినటువంటి బెనిఫిట్స్ అందుతాయి. క్రెడిట్ కార్డుకి దూరంగా ఉండండి. హోమ్ లోన్స్ కి కూడా దూరంగా ఉండటం మంచిది. కష్టేఫలి అన్నట్టుగా ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ప్రతిరోజు కూడా అరటి నార వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 3 కలిసి వచ్చే రంగు తెలుపు.

 


కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. మీరు ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తికి మంచి ధర వస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. దైవానుగ్రహం వల్ల నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. బంధు

మిత్రుల నుండి కొన్ని ఉపయోగపడే విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు అందివచ్చిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. పాస్పోర్టు వీసా గ్రీన్ కార్డు వంటి అంశాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. వ్యాపారంలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

 


మీనం: మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కాంట్రాక్టులు లీజులు లభిస్తాయి. ఉద్యోగ పరంగా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఋణాలు తీర్చ గలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. నలుగురికి సహాయపడాలి అనే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన పదవులు పొందుతారు. సంతాన పరంగా అభివృద్ధి బాగుంటుంది. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యములకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగం మారాలి అనుకునేవారు కొంతకాలం వేచి ఉండవలసిన సమయం. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించండి. నలుగురిలో ప్రత్యేకంగా ఉండడానికి ఎక్కువగా శ్రమిస్తారు. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు బ్లూ.

Tags:    

Similar News