Uddhav Thackeray: పార్టీ వీడాలనుకునేవారు వెళ్లిపోవచ్చు: ఉద్ధవ్ ఠాక్రే
ఉద్ధవ్ ఠాక్రే
Uddhav Thackeray: శివసేన (యూబీటీ) ఎంపీలు ఏక్‌నాథ్ శిందే వర్గంలో చేరే అవకాశాలపై వస్తున్న వార్తలపై పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. పార్టీని వీడాలనుకునే వారు ఎవరైనా స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చని, వారిని ఎవరినీ బలవంతంగా ఉంచుకోవాలని తనకు ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
2022లో శివసేనలో జరిగిన పెద్ద చీలికను ప్రస్తావిస్తూ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. నాలుగేళ్ల క్రితం పార్టీలో తిరుగుబాటు జరిగి 40 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఎవరినీ పార్టీలో ఉండమని బలవంతం చేయకూడదని అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
పార్టీని వీడిన వారు ఒకరోజు పశ్చాత్తాపపడతారని, కానీ అప్పటికి సమయం మించిపోతుందని ఉద్ధవ్ హెచ్చరించారు. ప్రస్తుతం సమయం తనకు అనుకూలంగా లేకపోయినా రేపు తప్పకుండా తనదే అవుతుందని, అంతవరకు ఓర్పుతో ముందుకు సాగుతానని అన్నారు.
ఇక, ‘ఆపరేషన్ టైగర్’ పేరుతో శిందే వర్గం ఠాక్రే వర్గ ఎంపీలను తమ వైపు తిప్పుకోవడానికి కుట్ర పన్నుతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఉద్ధవ్ సేన ఎంపీ సంజయ్ రౌత్ ఖారీ చేశారు.