Puri Jagannath Rath Yatra: ఒడిశా రాష్ట్రంలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథుడి రథయాత్ర సందర్భంగం భారీ తొక్కిసలాట జరిగి దారుణం సంభవించింది. భక్తుల భారీ సమ్మేళనం కారణంగా ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి తక్షణ వైద్య సహాయం అందిస్తున్నారు.

మృతుల్లో ఒకరిని కటక్‌కు చెందిన అనిల్ దాస్‌గా గుర్తించారు. మరొక మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పూరీ ప్రాంతం కిక్కిరిసిపోయిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

స్థానిక పోలీసులు, అధికారులు సంఘటన స్థలంలో హాజరై పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రథయాత్ర సందర్భంగం భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

జగన్నాథుడి రథయాత్ర భక్తులకు ప్రధాన తీర్థయాత్రగా ప్రసిద్ధి చెందినప్పటికీ, ఈ ఏడాది భారీ రద్దీలో ఈ దుర్ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మృతుల కుటుంబాలకు భరోసా అందించాలని ఆక్షేపాలు వస్తున్నాయి.

Tags: