Union Budget 2026–27: కేంద్ర బడ్జెట్ 2026-27: ముఖ్యాంశాలు – ఒక్క చూపులో

ఒక్క చూపులో

Update: 2026-02-02 06:05 GMT

Union Budget 2026–27: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026న పార్లమెంటులో ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2026-27, 'యువ శక్తి'పై దృష్టి సారించినదిగా ఉంది. ఇది దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి సుస్థిరం చేయడం, ప్రజల ఆకాంక్షల సాకారం, అందరి వికాసం అనే మూడు కర్తవ్యాలపై ఆధారపడింది. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా సంస్కరణలు, మౌలిక సదుపాయాలు, ఉత్పాదకత పెంపు, ఉపాధి కల్పనపై ప్రాధాన్యత ఇచ్చింది.

బడ్జెట్ పరిమాణం మరియు ఆర్థిక సూచికలు

మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.53.5 లక్షల కోట్లు.

పన్ను రాబడుల అంచనా రూ.28.7 లక్షల కోట్లు.

మార్కెట్ల నుంచి రుణాలు రూ.17.2 లక్షల కోట్లు (సెక్యూరిటీస్ రుణాలు రూ.11.7 లక్షల కోట్లు).

2026-27లో జీడీపీలో ద్రవ్యలోటు 4.3%కి తగ్గింపు (గత ఏడాది 4.4%).

రుణాల నిష్పత్తి 55.6%కి తగ్గుతుంది (గత ఏడాది 56.1%).

రాష్ట్రాలకు పన్నుల వాటా కింద రూ.1.4 లక్షల కోట్లు పంపిణీ.

పన్ను సంస్కరణలు

ఆదాయపు పన్ను రేట్లు యథాతథంగా ఉన్నాయి.

ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలు.

ఫ్యూచర్స్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) 0.02% నుంచి 0.05%కి పెంపు.

ఆప్షన్స్ ప్రీమియం, ఆప్షన్స్‌పై STT వరుసగా 0.15%, 0.125%కి పెంపు.

విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS 2%కి తగ్గింపు.

విదేశీ విద్య, వైద్య చికిత్సలపై TCS 2%కి కుదింపు.

వ్యక్తిగత వినియోగ దిగుమతి వస్తువులపై సుంకం 20% నుంచి 10%కి తగ్గింపు.

క్యాన్సర్ చికిత్సకు 17 ఔషధాలు, అరుదైన వ్యాధుల ఔషధాలు, ఆహారాలపై దిగుమతి సుంకాల మినహాయింపు.

ఆడిట్ చేయని వ్యాపారాల ITR దాఖలు గడువు ఒక నెల పొడిగింపు (ఆగస్టు 31 వరకు).

భారత్‌లో డేటా సెంటర్ల నుంచి అంతర్జాతీయ సేవలు అందించే విదేశీ కంపెనీలకు 2047 వరకు పన్ను మినహాయింపు.

మౌలిక సదుపాయాలు, రవాణా

తూర్పు డాంకునీ నుంచి పడమర సూరత్ వరకు ప్రత్యేక రైల్వే మార్గం.

వచ్చే 5 ఏళ్లలో 20 జాతీయ జలమార్గాల నిర్మాణం.

ముంబయి-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, దిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగుడి మధ్య 7 హైస్పీడ్ రైల్ కారిడర్లు.

పట్టాలపైకి 350కిపైగా సంస్కరణలు.

వ్యవసాయం, ఆరోగ్యం, ఇతర రంగాలు

500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్ల అభివృద్ధి.

దివ్యాంగజన్ కౌశల్ యోజన – ఐటీ, హాస్పిటాలిటీ, ఆహార రంగాల్లో ఉపాధి.

5 ప్రాంతీయ వైద్య కేంద్రాలు, 3 అఖిల భారత ఆయుర్వేద సంస్థలు.

5 విశ్వవిద్యాలయ టౌన్‌షిప్‌లు.

పూర్వోదయ రాష్ట్రాల్లో 5 పర్యాటక కేంద్రాలు, 4 వేల ఎలక్ట్రిక్ బస్సులు.

బుద్ధిస్ట్ సర్క్యూట్స్ కోసం ప్రత్యేక పథకం.

ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, యువత శక్తిని ఉపయోగించుకుని, అందరి అభివృద్ధికి దోహదపడేలా రూపొందించబడింది.

Tags:    

Similar News