వైరల్‌ అయిన విమాన ప్రమాద వీడియో

ఆర్యన్‌ అన్సారీ కాకతాళీయంగా సెల్‌ ఫోన్లో షూట్‌ చేసిన దృశ్యాలే;

Update: 2025-06-16 09:20 GMT

ఒక్కోసారి యధాలాపంగా చేసిన కొన్ని పనులు బాగా ఫేమస్‌ అయిపోతాయి. అలాంటి సంఘనటనే ఒకటి అహ్మదాబాద్‌ లో ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ 787-8 విమానం కూలిపోయినప్పుడు జరిగింది. ఆరోజు విమానం కూలిపోయిన మెడికల్ కళాశాల హస్టల్‌ సమీపంలోని ఓ భవనం పైన ఆర్యన్ అన్సారీ అనే పదిహేడేళ్ల యువకుడు ఆడుకుంటున్నాడు. ఎన్నడూ లేని విధంగా తను ఉన్న భవానం పైనుంచి భూమికి అత్యంత దగ్గరగా పెద్ద ఆకారంలో విమానం వెళ్లడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. బహుసా విమానం భూమి మీదకు దిగుతోందేమో అని భావించి ఫ్లైట్‌ ల్యాండింగ్ ని తన సెల్‌ ఫోన్లో చిత్రీకరించి అతని మిత్రులకు చూపించాలనే ఆలోచన కలిగింది. వెంటనే తన సెల్‌ పోన్లో కెమెరా ఓపెన్‌ చేసి ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌ ని చిత్రీకరించడం ప్రారంభించాడు. కొద్ది నిమిషాల్లోనే ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌ ఆర్యన్ సమీపంలోనే కూలిపోవడం పెద్దపెట్టున మంటలు వ్యాపించడం ఈ మొత్తం వ్యవహారాన్నంతటినీ ఆర్యన్ తన సెల్‌ ఫోన్లో చిత్రీకరించాడు. అదే వీడియో ఇప్పుడు అత్యధికంగా షేర్లు అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్న వీడియో ఆర్యన్‌ చిత్రీకరించందే. తాను రికార్డు చేసిన వీడియో ప్రపంచం అంతటా అంతగా వైరల్‌ అవుతుందని ఆర్యన్ ఊహించలేదు. అంతే కాకుండా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఆర్యన్ చిత్రీకరించిన వీడియోనే ఉపయోగపడుతోంది. ప్రమాదానికి కారణం, విమాన ప్రమాదం జరిగిన సమయంలో పరిస్ధితులు ఎలా ఉన్నాయి అనే దృశ్యాలు చాలా స్పష్టంగా ఆర్యన్‌ వీడియోలో కనిపిస్తున్నాయి. కాకతాళీయంగానైనా ఆర్యన్‌ ఈ వీడియో తీయడం వల్ల కీలక ఆధారాలు దర్యాప్తు బృందానికి లభ్యమయ్యాయి. ప్రమాదానికి గురైన విమానం శబ్దాలు, క్రమంగా విమానం కిందకి వస్తున్న తీరు అసాధారణంగా అనిపించి ఆర్యన్ ను ఈ వీడియో తీయడానికి పురిగొల్పాయి.

విమాన ప్రమాదం వీడియో తీయడంపై ఓ వార్తా సంస్ధతో ఆర్యన్ అన్సారీ మాట్లాడుతూ విమానం ల్యాండ్‌ అవుతోందని భావించి ఆ దృశ్యాలను నా మిత్రులకు చూపించడానికి తన సెల్‌ ఫోన్లో చిత్రీకరించినట్లు చెప్పాడు. అయితే నేను వీడియో తీస్తుండగానే విమానం పెద్ద శబ్దంతో కూలిపోయి పెద్దయెత్తున మంటలు వ్యాపించాయని ఆ దృశ్యం చూసి తాను భయపడిపోయినట్లు ఆర్యన్ వివరించాడు. వెంటనే తాను తీసిన వీడియోను తన తండ్రి, సోదరికి చూపించానని అతను చెప్పాడు. ఇప్పుడు అదే వీడియో విశ్వ వ్యాప్తమయ్యింది.

Tags:    

Similar News