కెసిఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన;
స్వల్ప అస్వస్థత కారణంగా, గురువారం యశోద దవాఖానాలో అడ్మిట్ అయిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైద్యుల సలహామేరకు శనివారం డిశ్చార్జీ అయ్యారు.
రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో సాధారణ వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం,ఆరోగ్యం మెరుగ్గానే వుందని, సోడియం లెవల్స్ కొద్దిగా పెరిగాయని, యశోద వైద్యులు నిర్థారించిన సంగతి తెలిసిందే.
కాగా, వైద్య పరీక్షల్లో భాగంగా, ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వుంటుందని, ఆ తర్వాత, మరోసారి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి వుంటుందని యశోద వైద్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో.. రానున్న గురు, శుక్ర వారాల్లో వైద్య పరీక్షల నిమిత్తం మరోసారి యశోద హాస్పటల్ కు అధినేత కేసీఆర్ వెల్లనున్నారు.
కాగా..పూర్తి ఆరోగ్యంతో వున్న కేసీఆర్.. వైద్య పరీక్షల నడుమ విరామ సమయంలో, రాష్ట్రంలో సాగునీరు, రైతులు, వ్యవసాయం, తదితర ప్రజా సమస్యల మీద, గత రెండు రోజులుగా పార్టీ సీనియర్లతో చర్చిస్తూ సమాచారం తీసుకుంటూ తదనుగుణంగా సూచనలిస్తున్నారు.