హైదరాబాద్ కు భారీ వర్ష సూచన

Southwest monsoon reaches Hyderabad, heavy rain warning issued

Update: 2025-05-27 10:09 GMT

నైరుతీ రుతుపవనాలు అనుకున్న సమయాని కన్నా ముందే రాష్ట్రానికి చేరుకున్నాయి. ఉత్తర తెలంగాణ, గోదావరి తీర ప్రాంతాల్లో రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు రుతుపవనాలు హైదరాబాద్కు చేరుకుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఈ రోజు సాయంత్రం నుంచి ఏ క్షణమైన భారీ వర్షాలు ముంచెత్తుతాయని వెదర్ మాన్ అలర్ట్ ప్రకటించింది.

గ్రేటర్ హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని… ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

మరోవైపు చత్తీస్ఘడ్, ఉత్తర తెలంగాణ, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. ఉత్తర బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావంతో ఈ రోజు నుంచి మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.



Tags:    

Similar News