రాష్ట్ర వ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప సభలు

Viksit Bharat Sankalp Sabhas in Mandals across the State of Andhra Pradesh

Update: 2025-06-14 10:23 GMT

వికసిత్ భారత్ సంకల్ప సభలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో నిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 11సం.పరిపాలనలో అభివృద్ధి, సంక్షేమం క్షేత్ర స్థాయిలో వివరించేందుకు ఈ సభలు లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పురంధేశ్వరి వెల్లడించారు. ఈమేరకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలతో ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ ఆడియో కాన్ఫరెన్స్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి మాట్లాడుతూ మండలాల్లో సభలకు జిల్లా స్థాయి లో ముందు గా కార్యాచరణ యోజన చేయాలని పార్టీ శ్రేణులు కు వివరించారు.

నరేంద్ర మోడీ పరిపాలనలో నే అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరువ అయ్యాయని చెప్పారు. బిజెపి ప్రజా ప్రతినిధులు, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు ఈసభల్లో ముఖ్య వక్తలు గా హాజరు అవుతారన్నారు.ఆడియో కాన్ఫరెన్స్ లో బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ పలు సూచనలు చేశారు.బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గారపాటి సీతారామంజనేయ చౌదరి (తపన. ఫౌండేషన్), సన్నపురెడ్డి దయాకర్ రెడ్డి లు జరిగే కార్యక్రమం యోజన వివరించారు

Tags:    

Similar News