కర్ణాటకలోని మైసూరు అవధూత దత్త పీఠంలో ఈరోజు(గురువారం) ఉదయం అవధూత దత్తపీఠాధిపతి పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిచే సహస్ర చండి, వన దుర్గ వృక్ష శాంతి మహా యజ్ఞం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా యాగ మంటపంలో గణపతి హోమం ప్రారంబించారు. భక్తులు స్వయంగా సమిధలు సమర్పించారు. అనంతరం సహస్ర చండి యాగం ఋత్విక్ వరణంతో దీక్షా వస్త్రాలు అందజేశారు. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. మొత్తం 12 హోమ గుండాలలో ఈ యాగం జరగనుంది. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం పారాయణాలు, మహారుద్రయంత్రాలతో ప్రాంగణం సుసంపన్నం కానుంది.

Tags: