సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి 'వందే భారత్ స్లీపర్'
'Vande Bharat Sleeper' from Secunderabad to Delhi soon
సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్ రైలు నడిపేందుకు రైల్వేశాఖ ప్లాన్ చేస్తోంది.1667కిలో మీటర్ల దూరాన్ని ఈ రైలు ఒక్క రోజులోనే చేరనుంది. ఢిల్లీలో రాత్రి 8.50కు బయల్దేరే ఈ రైలు తర్వాతి రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ రానుంది. థర్డ్ AC ధర ₹3600, సెకండ్ AC ₹4800, ఫస్ట్ AC ₹6వేలు వరకూ ఉండొచ్చు. ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, ఇటార్సి, నాగ్ పూర్, బల్లార్ష, కాజీపేట స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది. ముందుగా వారానికి ఒకరోజు ప్రారంభించి ఆ తర్వాత రెగ్యులర్ చేస్తారని సమాచారం.
సికింద్రాబాద్-ఢిల్లీ వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ప్రస్తుతం ఢిల్లీ వెళ్లే వారికి రైలు ప్రయాణం ప్రహాసనంగా తయారైంది. అటు విమాన చార్జీలు అందుబాటులో లేక...రైళ్లు సమయానికి వెళ్లక ఢిల్లీ వెళ్లే తెలంగాణ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.