‘Maa Inti Bangaaram’: 100 కోట్ల బ్లాక్‌బస్టర్ 'మా ఇంటి బంగారం' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
‘Maa Inti Bangaaram’: ఓటీటీ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్‌న్యూస్! టాలీవుడ్ క్వీన్ సమంత లీడ్ రోల్‌లో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ 'మా ఇంటి బంగారం'.. ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమైపోయింది!
వరుస పరాజయాలు, లాంగ్ బ్రేక్ తర్వాత సమంత రీఎంట్రీ ఇస్తూ చేసిన ఈ క్లీన్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను డైరెక్టర్ నందిని రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. జూన్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. పెద్దగా అంచనాలు లేకుండానే రిలీజై, బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. సౌత్ ఇండియాలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన తొలి లేడీ ఓరియెంటెడ్ సినిమాగా 'మా ఇంటి బంగారం' చరిత్ర సృష్టించింది.
సమంత పవర్ ప్యాక్డ్ యాక్షన్, అద్భుతమైన నటన.. నందిని రెడ్డి వైవిధ్యమైన టేకింగ్ ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరియు యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. రొటీన్ కథే అయినా.. సమంత తన మ్యాజిక్‌తో థియేటర్లను హౌస్‌ఫుల్ చేయించారు.
మరి థియేటర్లలో మ్యాజిక్ రిపీట్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ జులై 17 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (JioHotstar) వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. "ఒక్కొక్కడిని కొడతాం చూడు ప్రేమతో అబ్బా.." అంటూ ఓ క్రేజీ క్యాప్షన్‌ను కూడా జోడించింది ఓటీటీ సంస్థ.