2026 Australian Open: తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా కార్లోస్ అల్కరాజ్
చాంపియన్‌గా కార్లోస్ అల్కరాజ్
2026 Australian Open: కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ కోసం రెండేండ్లుగా పోరాడుతున్న సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్‌కు చెక్ పెట్టిన.. స్పెయిన్ సూపర్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ అల్కరాజ్ 2–6, 6–2, 6–3, 7–5తో నాలుగోసీడ్ జొకోవిచ్పై గెలిచాడు. ఫలితంగా మెన్స్ టెన్నిస్ చరిత్రలో నాలుగు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గి కెరీర్ స్లామ్ పూర్తి చేసిన అతిపిన్న వయస్కుడిగా అల్కరాజ్ (22 ఏళ్ల 272 రోజులు) రికార్డు సృష్టించాడు.
దీంతో 1932లో డాన్ బడ్జ్ (22 ఏళ్ల 363 రోజులు) రికార్డును బద్దలుకొట్టాడు. ఓవరాల్‌గా కెరీర్ స్లామ్‌ను పూర్తి చేసిన తొమ్మిదో ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. ఇందులో జొకోవిచ్, నడాల్, ఫెడరర్ కూడా ఉన్నారు. అల్కరాజ్ కెరీర్‌లో ఏడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ( ఆస్ట్రేలియన్, వింబుల్డన్– 2, ఫ్రెంచ్ 2, యూఎస్– 2) ఉన్నాయి. మ్యాచ్ తర్వాత.. ‘జాబ్ డన్. 4/4 కంప్లీట్’ అని అల్కరాజ్ టీవీ లెన్స్‌పై రాశాడు. మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గత10 ఫైనల్స్‌లో ఎప్పుడూ ఓడిపోని నొవాక్ తొలి పరాజయంతో కాసింత నిరాశతోనే వెనుదిరిగాడు.