2028 Olympics: 2028 ఒలింపిక్స్ కు వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్
వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్;
2028 Olympics: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్ క్రీడల కోసం ఒక ప్రత్యేకమైన వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ లాస్ ఏంజెల్స్‌లో ఒలింపిక్స్ నిర్వహణ కోసం కేంద్ర, రాష్ట్ర , స్థానిక ప్రభుత్వ ఏజెన్సీల మధ్య సమన్వయం చేస్తుంది. క్రీడల సమయంలో భద్రతను పర్యవేక్షిస్తుంది.ఈ టాస్క్ ఫోర్స్‌కు ట్రంప్ వైస్ ప్రెసిడెంట్, ఇతర క్యాబినెట్ సభ్యులు, హోంల్యాండ్ సెక్యూరిటీ, రవాణా, రక్షణ, న్యాయ శాఖ , ఎఫ్‌బీఐ వంటి ఏజెన్సీల అధికారులు ఉంటారు. ఒలింపిక్స్ సజావుగా, విజయవంతంగా జరిగేలా చూస్తోంది.
ఈ టాస్క్ ఫోర్స్ ముఖ్యంగా విదేశీ అథ్లెట్లు, కోచ్‌లు, అధికారులు , మీడియా సిబ్బందికి వీసా ప్రక్రియను సులభతరం చేయడంలో సహాయపడుతుంది. అలాగే, వారి రాకపోకల లాజిస్టిక్స్‌ను పర్యవేక్షిస్తుంది.ఈ క్రీడల ద్వారా అమెరికా సామర్థ్యాన్ని, అతిథి మర్యాదలను, ఆర్థిక అవకాశాలను ప్రపంచానికి చాటడం ఈ టాస్క్ ఫోర్స్ లక్ష్యాలలో ఒకటి.
ఒలింపిక్స్ వల్ల సుమారు 90,000 ఉద్యోగాలు సృష్టించబడతాయని, సుమారు $6 బిలియన్ల కార్మిక ఆదాయం లభిస్తుందని రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు $700 మిలియన్ల ట్యాక్స్ ఇన్ కమ్ వస్తుందని అంచనా. ఈ ప్రయోజనాలను పూర్తిగా అందిపుచ్చుకోవడానికి టాస్క్ ఫోర్స్ కృషి చేస్తుంది.