Zahoor Khan: బుమ్రాకు ఆ టెక్నిక్ నేర్పించింది నేనే: యూఏఈ బౌలర్ జహూర్ ఖాన్

యూఏఈ బౌలర్ జహూర్ ఖాన్

Update: 2026-03-11 09:24 GMT

Zahoor Khan: ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరు బుమ్రా. అలాంటి బుమ్రాకే బౌలింగ్ లో మెలకువలు నేర్పించాడంట జహూర్ ఖాన్ . 2019 ఐపీఎల్ సీజన్ సమయంలో జహూర్ ఖాన్ ముంబై ఇండియన్స్ జట్టుకు నెట్ బౌలర్‌గా పనిచేసే సమయంలో బుమ్రాతో కలిసి ప్రాక్టీస్ చేసే అవకాశం ఆయనకు దక్కిందన్నాడు. సాధారణంగా బౌలర్లు స్లో బాల్ వేసేటప్పుడు వారి చేతి వేగంలో (Arm Speed) మార్పు కనిపిస్తుంది, దీనివల్ల బ్యాటర్లు సులభంగా పసిగట్టేస్తారు. కానీ జహూర్ ఖాన్ ప్రత్యేకత ఏంటంటే తన బౌలింగ్ యాక్షన్‌లో గానీ, చేతి వేగంలో గానీ ఎటువంటి మార్పు లేకుండానే చాలా నెమ్మదిగా ఉండే బంతిని విసరగలరు.బుమ్రా ఈ విద్యను చూసి ఆశ్చర్యపోయి, దాన్ని ఎలా వేయాలో నేర్పించమని జహూర్‌ను అడిగారట.

జహూర్ ఖాన్ మాటల్లో..

"బుమ్రా నా దగ్గరకు వచ్చి ఆ స్లోయర్ బాల్ ఎలా వేస్తున్నావని అడిగారు. నా యాక్షన్‌లో ఎలాంటి మార్పు ఉండదు, కానీ బంతి మాత్రం చాలా స్లోగా వెళ్తుంది. ఆయనకు ఆ టెక్నిక్ నేర్పించడం నాకు చాలా గర్వంగా అనిపించింది." అని జహూర్ ఒక సందర్భంలో తెలిపారు. నిజానికి బుమ్రా లాంటి గొప్ప బౌలర్ కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఈ సంఘటన నిరూపిస్తుంది. జహూర్ ఖాన్ కూడా UAE తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. కొందరు నెటిజన్లు జహూర్ ఖాన్ పై విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్ లో పుట్టిన ప్రతిఒక్కరికి గొప్పలు చెప్పుకోవడం, అబద్ధాలు ఆడటం బై బర్తే వస్తాయని కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News