ICC Player of the Month: ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో అభిషేక్, కుల్దీప్

రేసులో అభిషేక్, కుల్దీప్

Update: 2025-10-08 04:57 GMT

ICC Player of the Month: ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (సెప్టెంబర్) అవార్డు రేసులో భారత ఆటగాళ్లు అభిషేక్ శర్మ , కుల్‌దీప్ యాదవ్ ఉన్నారు. వారిద్దరూ అద్భుతమైన ప్రదర్శనతో ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. ,

అభిషేక్ శర్మ ఆసియా కప్ 2025 లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' గా నిలిచాడు. ఏడు టీ20ల్లో 314 పరుగులు చేశాడు.

అతని స్ట్రైక్ రేట్ 200 గా ఉంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక బ్యాటింగ్ రేటింగ్ పాయింట్లు (931) సాధించాడు.

కుల్‌దీప్ యాదవ్ ఆసియా కప్‌లో అత్యధికంగా 17 వికెట్లు తీసి, ప్రధాన వికెట్ టేకర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో 4/30తో సహా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఇద్దరు భారత ఆటగాళ్లతో పాటు, జింబాబ్వే బ్యాట్స్‌మెన్ బ్రెయాన్ బెన్నెట్ కూడా ఈ అవార్డు రేసులో ఉన్నాడు. అతను సెప్టెంబర్ నెలలో 9 టీ20ల్లో 497 పరుగులు చేశాడు. ఈ ముగ్గురిలో విజేతను త్వరలో ఐసీసీ ప్రకటించనుంది.

Tags:    

Similar News