Abhishek Sharma Buys a Costly Car: కాస్ట్ లీ కారు కొన్న అభిషేక్ శర్మ..ఎన్ని కోట్లంటే.?

ఎన్ని కోట్లంటే.?

Update: 2025-10-11 05:11 GMT

Abhishek Sharma Buys a Costly Car: భారత క్రికెటర్ అభిషేక్ శర్మ అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేశారు.ఆసియా కప్ 2025లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకుని అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత, అభిషేక్ శర్మ తన సొంత డబ్బుతో ఒక లగ్జరీ స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశారు.ఫెరారీ V12 (Ferrari V12) కారును కొన్నారు. బ్లాక్ కలర్ లో ఉండే ఈ కారు విలువ భారత్ లో దాదాపు రూ. 5.2 కోట్లు ఉంటుంది. ఈ విషయాన్ని అభిషేక్ శర్మ తన సోషల్ మీడియా వేదికగా "V12" అనే క్యాప్షన్‌తో కారు ఫోటోలను పోస్ట్ చేశారు.

ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో అభిషేక్ శర్మ అద్భుతమైన, విధ్వంసకర ప్రదర్శన కనబరిచి, టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆసియా కప్ 2025లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 314 పరుగులతో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు గెలిచినందుకు గానూ, అభిషేక్ శర్మకు హవల్ హెచ్9 (Haval H9) SUV కారు కూడా బహుమతిగా లభించింది. దాని విలువ సుమారు రూ. 33 లక్షలు. అయితే ఫెరారీ V12 మాత్రం ఆయన సొంతంగా కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన కారు. అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సెప్టెంబర్ మంత్ కు కూడా నామినేట్ అయ్యాడు.

Tags:    

Similar News