Champions League Returns: పదేళ్ల తర్వాత.. మళ్లీ చాంపియన్స్ లీగ్.!
మళ్లీ చాంపియన్స్ లీగ్.!;
By : PolitEnt Media
Update: 2025-07-22 10:06 GMT
Champions League Returns: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. దాదాపు 10 సంవత్సరాల విరామం తర్వాత ఛాంపియన్స్ లీగ్ T20 (CLT20) 2026లో తిరిగి రాబోతోంది. దీనిని వరల్డ్ క్లబ్ ఛాంపియన్‌షిప్ అనే కొత్త పేరుతో వస్తున్నట్లు తెలుస్తోంది.
2026 సెప్టెంబర్ నుంచి తిరిగి ప్రారంభం కావచ్చని టాక్. BCCI , ECB, ICC చైర్మన్ జై షా దీనికి మద్దతిచ్చినట్లు సమచారం.
ప్రముఖ T20 లీగ్‌లైన IPL, BBL, PSL, SA20, The Hundred, ILT20, MLC వంటి వాటిలో గెలిచిన జట్లు ఈ లీగ్ లో పాల్గొంటాయి. గతంలో ఉన్న CLT20 తరహాలోనే గ్రూప్ దశ .. నాకౌట్ దశ ఉంటాయి. 8 నుంచి 12 జట్లు పాల్గొనే అవకాశం ఉంది.అయితే ICC నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చివరి సారి 2014లో జరిగిన చాంపియన్స్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది.