Slapgate Incident: 17 ఏళ్ల తర్వాత..శ్రీశాంత్, హర్భజన్ చెంప దెబ్బ వీడియో రిలీజ్

శ్రీశాంత్, హర్భజన్ చెంప దెబ్బ వీడియో రిలీజ్

Update: 2025-08-30 13:17 GMT

Slapgate Incident:  శ్రీశాంత్, హర్భజన్ సింగ్‌ల మధ్య 2008 ఐపీఎల్‌లో జరిగిన 'స్లాప్‌గేట్' ఘటనకు సంబంధించిన అన్‌సీన్ వీడియోను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

ఈ వీడియోను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ పాడ్‌కాస్ట్ షోలో లలిత్ మోదీ విడుదల చేశారు. అప్పట్లో ఈ ఘటన టీవీల్లో రికార్డు కాలేదు, కానీ తన సెక్యూరిటీ కెమెరాల్లో ఈ వీడియో రికార్డయినట్లు మోదీ తెలిపారు.

ఈ వీడియోలో, హర్భజన్ సింగ్ శ్రీశాంత్‌ను వెనక్కి కొట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన తర్వాత శ్రీశాంత్ మైదానంలో కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు మాత్రమే అప్పట్లో ప్రసారమయ్యాయి, కానీ అసలు వీడియో మాత్రం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.ఈ సంఘటన తర్వాత హర్భజన్ సింగ్‌పై బీసీసీఐ ఐపీఎల్ కమిటీ 11 మ్యాచ్‌ల నిషేధం విధించింది.

17 ఏళ్ల తర్వాత ఈ వీడియో బయటకు రావడంతో ఇది మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోను విడుదల చేయడంపై శ్రీశాంత్ భార్యతో సహా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇద్దరు ఆటగాళ్లు కూడా ఈ ఘటనను మరిచిపోయారని, ఇప్పుడు దీనిని మళ్లీ ప్రస్తావించడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News