WTC Champion: 27 ఏళ్ల తర్వాత.. WTC చాంపియన్ గా సౌతాఫ్రికా

WTC చాంపియన్ గా సౌతాఫ్రికా;

Update: 2025-06-14 12:25 GMT

WTC Champion: తొలిసారి ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంది సౌతాఫ్రికా. బవుమా సారథ్యంలో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌గా నిలిచింది . సెంచరీతో జట్టును గెలిపించాడు మార్‌క్రమ్‌. లార్డ్స్ వేదికగా ఇవాళ ఆస్ట్రేలియాతో ముగిసిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగో రోజు సౌతాఫ్రికా విజయానికి 69 పరుగులు అవసరం కాగా..డేవిడ్ బెడింగ్‌హామ్ (21) సహకారంతో సెంచరీ హీరో ఓపెనర్ మార్క్ రమ్ (207 బంతుల్లో 136: 14 ఫోర్లు) సఫారీ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. సౌతాఫ్రికా తరుఫున ఐసీసీ ఈవెంట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డ్‌ సృష్టించాడు.

సౌతాఫ్రికా టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవడం ఇదే తొలిసారి. అంతేకాదు 27 ఏళ్ళ తర్వాత సఫారీ జట్టు ఐసీసీ టైటిల్ గెలిచింది. చివరిసారిగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో సౌతాఫ్రికా ఐసీసీ టైటిల్ గెలిచింది. 2 వికెట్ల నష్టానికి 213 పరుగులతో నాలుగో రోజు బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికాపై ప్రారంభంలోనే బిగ్ షాక్ తగిలింది. హాఫ్ సెంచరీ చేసి జోరు మీదున్న బవుమా (66) ను స్టార్క్ ఔట్ చేశాడు. దీంతో జట్టు స్కోర్ 217 పరుగుల వద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్టబ్స్ తో కలిసి సెంచరీ హీరో మార్కరం జట్టును ముందుకు తీసుకెళ్లాడు. విజయానికి 6 పరుగులు కావాల్సిన దశలో మార్కరం ఔటైనా.. కైల్ వెర్రెయిన్ విన్నింగ్ రన్స్ తో సౌతాఫ్రికా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

Tags:    

Similar News