Andhra Premier League: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ : అమరావతి రాయల్స్ విక్టరీ
అమరావతి రాయల్స్ విక్టరీ
Andhra Premier League: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4 లో అమరావతి రాయల్స్ విజయం సాధించింది. ఆగస్టు 8న విశాఖపట్నంలోని ACA-VDCA స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో, అమరావతి రాయల్స్ జట్టు కాకినాడ కింగ్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతిని అమలు చేశారు.
మ్యాచ్ వివరాలు:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కాకినాడ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 229 పరుగుల భారీ స్కోరును సాధించింది. సాయి రాహుల్ (96), కెప్టెన్ కేఎస్ భరత్ (93) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. 230 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన అమరావతి రాయల్స్, వర్షం కారణంగా మ్యాచ్‌కి అంతరాయం ఏర్పడింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం అమరావతి రాయల్స్‌ను విజేతగా ప్రకటించారు. ఈ విజయం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4కు మంచి ప్రారంభాన్ని ఇచ్చింది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 7 జట్లు పాల్గొంటున్నాయి, ఇందులో అమరావతి రాయల్స్‌తో పాటు విజయవాడ సన్ షైనర్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, కాకినాడ కింగ్స్ , భీమవరం బుల్స్ ఉన్నాయి.