APL Season-4 : నేటి నుంచి ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-4 ప్రారంభం

ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, విక్టరీ వెంకటేష్‌;

Update: 2025-08-08 09:26 GMT

వైజాగ్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేటి నుంచి ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-4 క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం కానుంది. ప్రారంభ వేడుకలకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు, టాలీవుడ్‌ హీరో దగ్గుబాటి వెంకటేష్‌లు హాజరుకానున్నారు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభంకానున్న ఏపీఎల్‌ సీజన్‌-4 వేడుకలు నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సిజన్‌కి హీరో విక్టరీ వెంకటేష్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటారు. ప్రారంభవేడుకల్లో హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీచరణ్‌ పాకాల లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ ఉంటుంది. తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్‌, అమరావతి రాయల్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ రోజు శుక్రవారం సాయంత్రం 7.30 నిమిషాలకు ఏపీఎల్‌ సీజన్‌-4 తొలి మ్యాచ్‌ ప్రారంభంకాబోతోంది. ఏపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు వీక్షించడానికి క్రికెట్‌ అభిమానులకు ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ పార్లమెంట్‌ సభ్యులు కేశినేని శివనాథ్‌ ఉచిత ప్రవేశం కల్పించారు. స్టేడియం గేట్‌ నెంబర్‌15 నుంచి ప్రేక్షకుల ఫ్రీ ఎంట్రీకి అవకాశం ఇచ్చారు. సీజన్‌-4 టైటిల్‌ కోసం మొత్తం ఏడు జట్లు తలపడనున్నాయి. వీటిలో విజయవాడ సన్‌ షైనర్స్‌, రాయల్‌ ఆఫ్‌ రాయలసీమ, సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌, తుంగభద్ర వారియర్స్‌, అమరావతి రాయల్స్‌, కాకినాడ కింగ్స్‌, భీమవరం బుల్స్‌ జట్లు ఉన్నాయి. ఈ సీజన్‌లో జరిగే మొత్తం 25 మ్యాచుల్లో 21 లీగ్‌ మ్యాచ్‌లు ఉండగా 4 ప్లేఆఫ్‌లు జరుగుతాయి. ఈ నాలుగొవ సీజన్‌లో ప్రైజ్‌ మనీ కూడా భారీగా పెంచారు. ఏపీఎల్‌ సీజన్‌-4 విన్నర్‌ టీమ్‌కి రూ.35 లక్షలు ప్రైజ్‌ మనీగా నిర్ణయించారు. అలాగే రన్నరప్‌ టీమ్‌కి రూ.20 లక్షలు ప్రైజ్‌ మనీ ఇవ్వనున్నారు.

Tags:    

Similar News