Iceland Cricket’s Tweet Goes Viral: వైభవ్ ను అరెస్ట్ చేయాలి.. ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్ వైరల్
ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్ వైరల్
Iceland Cricket’s Tweet Goes Viral: జింబాంబ్వేలోని హరారే వేదికగా నిన్నజరిగిన అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసకర ఇన్నింగ్స్‌పై ఐస్‌ల్యాండ్ క్రికెట్ తనదైన శైలిలో సరదాగా స్పందించింది.
వైభవ్‌ను "అరెస్ట్ చేయాలి" అని ఐస్‌ల్యాండ్ క్రికెట్ ట్వీట్ చేయడానికి కారణం ఆయన చేసిన స్కోరు లేదా ఏదైనా తప్పు కాదు, కేవలం ఆయన ఆడిన "హింసాత్మక" బ్యాటింగ్! గురించి ఫన్నీ ట్వీట్ చేసింది.
ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 14 ఏళ్ల వైభవ్ కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇందులో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ బౌలర్లను వైభవ్ ఊచకోత కోయడాన్ని ఉద్దేశిస్తూ ఐస్‌ల్యాండ్ క్రికెట్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఇలా పోస్ట్ చేసింది "ఎవరైనా వైభవ్ సూర్యవంశీని ఇప్పుడే అరెస్ట్ చేయండి. ఇంగ్లాండ్ బౌలర్లపై మైదానంలో అతను చూపిస్తున్న ఈ హింస 'X-Rated' (అత్యంత భయంకరంగా) ఉంది!
వైభవ్ సూర్యవంశీ సృష్టించిన రికార్డులు:
అత్యధిక స్కోరు: అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు (175) సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
వేగవంతమైన శతకం: కేవలం 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, ఫైనల్స్ లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
సిక్సర్ల రికార్డు: ఒకే ఇన్నింగ్స్‌లో 15 సిక్సర్లు బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు.
వైభవ్ ఇన్నింగ్స్ పుణ్యమా అని భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఇంగ్లాండ్‌ను 307 పరుగులకే కట్టడి చేసి, భారత్ ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్‌ను ముద్దాడింది.