Ashes Third Test: యాషెస్ మూడో టెస్ట్..తడబడిన ఇంగ్లాండ్
తడబడిన ఇంగ్లాండ్
Ashes Third Test: ఆస్ట్రేలియాతో యాషెస్ మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో తడబడింది. హ్యారీ బ్రూక్ (45), బెన్ స్టోక్స్ (45 బ్యాటింగ్) మినహా మిగతా వారు నిరాశపర్చడంతో.. గురువారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌కు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 68 ఓవర్లలో 213/8 స్కోరు చేసింది. స్టోక్స్‌తో పాటు ఆర్చర్ (30 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఆరంభం నుంచే ఆసీస్ బౌలర్లు కమిన్స్ (3/54), బోలాండ్ (2/31) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లిష్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
చివర్లో జెమీ స్మిత్ (22) మెరుగ్గా ఆడినా స్నికో మీటర్ తప్పిదం వల్ల ఔటయ్యాడు. రెండు వికెట్లు తీసిన లైయన్ (2/51) ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ బౌలింగ్ లిస్ట్‌లో మెక్‌గ్రాత్ (563)ను అధిగమించి రెండో ప్లేస్ (564 వికెట్లు)కు చేరాడు. షేన్ వార్న్ (708) ముందున్నాడు. అంతకుముందు 326/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 91.2 ఓవర్లలో 371 రన్స్‌కు ఆలౌటైంది. స్టార్క్ (54) హాఫ్ సెంచరీ చేశాడు. ఆర్చర్ 5 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ స్కోరుకు ప్రస్తుతం ఇంగ్లండ్ ఇంకా 158 రన్స్ వెనుకుంజలో ఉంది.