Asia Cup 2025: ఇవాళ భారత్ vs బంగ్లాదేశ్..మనోళ్లకు ఎదురుందా?
మనోళ్లకు ఎదురుందా?
Asia Cup 2025: ఆసియా కప్ సూపర్ 4లో ఇవాళ భారత్-, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు దాదాపుగా ఆసియా కప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
ప్రస్తుతం సూపర్ 4 పాయింట్ల పట్టికలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లకు చెరి 2 పాయింట్లు ఉన్నాయి. అయితే, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా భారత్ మొదటి స్థానంలో ఉంది. ఈరోజు గెలిస్తే, భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌లో చోటు ఖాయం చేసుకుంటుంది.
టీ20 ఫార్మాట్‌లో భారత్, బంగ్లాదేశ్ ఇప్పటివరకు 17 మ్యాచ్‌లలో తలపడ్డాయి. వీటిలో భారత్ 16 మ్యాచ్‌లలో గెలిచి, కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఓడిపోయింది. ఇది భారత్‌కు అనుకూలమైన రికార్డు.
జట్లు అంచనా
ఇండియా: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
బంగ్లాదేశ్: సైఫ్ హసన్, తంజీద్ హసన్, లిటన్ దాస్ (కెప్టెన్, కీపర్), తౌహిద్ హృదయ్, షమీమ్ హుస్సేన్, జాకర్ అలీ, మెహిదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.