Asia Cup Final Tomorrow: ఆసియా కప్ రేపే ఫైనల్ పోరు..గెలిచిన జట్లుకు ఎన్ని కోట్లంటే?
గెలిచిన జట్లుకు ఎన్ని కోట్లంటే?
Asia Cup Final Tomorrow: ఆసియా కప్ ఫైనల్ పోరు రేపు జరగనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోఇండియా,పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో భారత్ ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శన చేసింది. సూపర్-4 దశలో పాకిస్థాన్ , బంగ్లాదేశ్‌పై విజయం సాధించి అజేయంగా ఫైనల్‌కు చేరుకుంది. సెప్టెంబర్ 26న శ్రీలంకతో జరిగిన చివరి సూపర్-4 మ్యాచ్‌లో కూడా ఉత్కంఠభరితమైన పోరాటం తర్వాత సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది.
ఇంతకుముందు జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్‌లలో అత్యధిక సార్లు (8 సార్లు) విజేతగా నిలిచిన జట్టు భారత్ . ఈ సంవత్సరం ఫైనల్‌లో భారత్ విజయం సాధించి తొమ్మిదోసారి టైటిల్‌ను గెలుచుకుంటుందా లేదా పాకిస్థాన్ విజయం సాధిస్తుందా అనేది ఫైనల్ మ్యాచ్ తర్వాత తెలుస్తుంది.
ఆసియా కప్ 2025 విజేతగా నిలిచిన జట్టుకు $300,000 (దాదాపు రూ.2.6 కోట్లు) ప్రైజ్ మనీ లభిస్తుంది. ఫైనల్‌లో ఓడిపోయిన జట్టుకు $150,000 (దాదాపు రూ.1.3 కోట్లు) లభిస్తుంది. టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి $15,000 నుంచి $20,000 (దాదాపు రూ.12-16 లక్షలు) లభించవచ్చు.
ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడికి $5,000 (దాదాపు రూ.4.34 లక్షలు) లభిస్తుంది.