Shreyas Confirmed: రేపే ఆసియా కప్ ఎంపిక..శ్రేయస్ కన్ఫర్మ్..!
శ్రేయస్ కన్ఫర్మ్..!;
Shreyas Confirmed: రేపు ఆసియా కప్ కోసం భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ ఎంపిక కమిటీ సమావేశం ముంబైలో జరగనుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొంటారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నమెంట్ T20 ఫార్మాట్‌లో జరుగుతుంది. కాబట్టి వచ్చే ఏడాది జరిగే T20 వరల్డ్ కప్‌కు ఇది ఒక సన్నాహక టోర్నమెంట్ లాగా ఉపయోగపడుతుంది.
సెలెక్షన్‌కు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ వంటి వారి ఎంపికపై చర్చ జరుగుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉంటారని, అలాగే ఫిట్‌నెస్ సాధించిన జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులో ఉంటారని సమాచారం. కొత్త ఆటగాళ్లు రింకు సింగ్, శివమ్ దూబే వంటి వారికి కూడా జట్టులో చోటు లభించే అవకాశం ఉంది.
ఆసియా కప్ 2025లో శ్రేయస్ అయ్యర్ ఎంపిక దాదాపు ఖాయమైనట్లే అని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ, ఆ తర్వాత ఐపీఎల్‌లో అతను అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో సెలెక్టర్లు అతనికి టీ20 జట్టులో చోటు కల్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.