Asian Boxing Under-22 Championship: ఫైనల్ కు చేరిన నలుగురు బాక్సర్లు

నలుగురు బాక్సర్లు;

Update: 2025-08-07 11:25 GMT

Asian Boxing Under-22 Championship: ప్రస్తుతం బ్యాంకాక్‌లో జరుగుతున్న అండర్‌-22 ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. భారత్‌కు ఇప్పటికే పతకాలు ఖాయమయ్యాయి.

ఈ ఛాంపియన్‌షిప్‌లో నలుగురు భారత బాక్సర్లు ఫైనల్స్‌కు చేరుకున్నారు.పలువురు భారత బాక్సర్లు సెమీఫైనల్స్‌కు చేరుకొని పతకాలను ఖాయం చేసుకున్నారు. వీళ్లు గోల్డ్ లేదా సిల్వర్ పతకాలను గెలుచుకుంటారు.

ఫైనల్ కు చేరిన వారిలో యాత్రి పటేల్ (57 కేజీలు), ప్రియ (60 కేజీలు), ఇషాన్ కటారియా (90 కేజీలు), నీరజ్ (75 కేజీలు) ఉన్నారు. భారత బాక్సర్లు ఈ టోర్నమెంట్‌లో తమ సత్తాను చాటి, దేశానికి మరిన్ని పతకాలు తీసుకురావాలని ఆశిస్తున్నారు.

సెమీఫైనల్స్‌లో ఓడిపోయిన బాక్సర్లు కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. వీరిలో హర్ష్ (60 కేజీలు), మయూర్ (90 కేజీలు), రాకీ చౌదరి (85 కేజీలు) వంటి బాక్సర్లు ఉన్నారు.

అండర్ 19 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా భారత బాక్సర్లు తమ సత్తాను చాటారు. ఏడుగురు మహిళా బాక్సర్లు సెమీఫైనల్స్‌కు చేరుకుని పతకాలు ఖాయం చేసుకున్నారు.

వీరిలో యాక్షిక (51 కేజీలు), నిషా (54 కేజీలు), ముస్కాన్ (57 కేజీలు), వినీ (60 కేజీలు), నిషా (65 కేజీలు), ఆకాంక్ష ఫలస్వాల్ (70 కేజీలు), మరియు ఆర్తి కుమారి (75 కేజీలు) ఉన్నారు.

Tags:    

Similar News