Australia's Record Victory: సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా రికార్డ్ విక్టరీ
ఆస్ట్రేలియా రికార్డ్ విక్టరీ;
Australia's Record Victory: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మాకేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏకంగా 276 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఇది వన్డే క్రికెట్‌లో పరుగుల పరంగా ఆస్ట్రేలియాకు ఒక రికార్డు విజయం.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు సెంచరీలు చేసి చరిత్ర సృష్టించారు. ట్రావిస్ హెడ్ (142 పరుగులు), కెప్టెన్ మిచెల్ మార్ష్ (100 పరుగులు), కామెరూన్ గ్రీన్ (118 పరుగులు) అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోరు సాధించడానికి దోహదపడ్డారు.
432 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 155 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లను దక్షిణాఫ్రికా గెలుచుకుంది. అయినప్పటికీ, చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సాధించిన ఈ రికార్డు విజయం వారికి ఒక గొప్ప ఊరటనిచ్చింది. ఈ సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1 తేడాతో గెలుచుకుంది.ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. కేశవ్ మహరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.