Bangladesh: శ్రీలంక గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర
బంగ్లాదేశ్ చరిత్ర;
Bangladesh: శ్రీలంకతో జరిగిన మూడో టీ20 లో బంగ్లాదేశ్ గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ ను 2-1 తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఇది శ్రీలంక గడ్డపై బంగ్లాదేశ్‌కు తొలి టీ20 సిరీస్ విజయం కావడం విశేషం.133 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. లిటన్ దాసు 32, తంజిద్ హసన్ తమీమ్ 73 పరుగులు (నాటౌట్) చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు . ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ మెహెదీ హసన్ 4 వికెట్లు తీసి శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు.
ఫస్ట్ టీ20 లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించింది. రెండో టీ20లో బంగ్లాదేశ్ 83 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయం బంగ్లాదేశ్ క్రికెట్‌కు ఒక మైలురాయిగా నిలిచింది. అంతకుముందు జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌లలో ఓటమికి ఈ గెలుపుతో బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకుంది.