BCCI Bans England Star Cricketer: ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ పై బీసీసీఐ బ్యాన్

బీసీసీఐ బ్యాన్

Update: 2025-12-09 11:39 GMT

BCCI Bans England Star Cricketer: ఇంగ్లాండ్‌కు చెందిన స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 2026 ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొనేందుకు అవకాశం లేదు. నికి ప్రధాన కారణం BCCI ఇటీవల తీసుకొచ్చిన కొత్త నిబంధన, హ్యారీ బ్రూక్ గతంలో తీసుకున్న నిర్ణయాలే.

హ్యారీ బ్రూక్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.25 కోట్లకు జట్టు కొనుగోలు చేసింది.అయితే, టోర్నమెంట్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు, హ్యారీ బ్రూక్ అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం,వర్క్‌లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఐపీఎల్ 2025 సీజన్ నుండి వైదొలగాడు.

వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడు, గాయం లేదా వైద్య కారణాలు కాకుండా ఇతర కారణాల వల్ల సీజన్ ప్రారంభానికి ముందు వైదొలిగితే, ఆ ఆటగాడిపై రెండేళ్ల పాటు నిషేధం విధించాలని బీసీసీఐ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.ఈ నిబంధన ప్రకారం, హ్యారీ బ్రూక్ ఐపీఎల్ 2025 , ఐపీఎల్ 2026 సీజన్లలో ఆడటానికి కానీ, వేలంలో పాల్గొనడానికి కానీ అర్హుడు కాడు.ఈ కారణాల వల్ల, హ్యారీ బ్రూక్ 2026 మినీ వేలంలో అందుబాటులో ఉండడు.ఐపీఎల్ నుంచి తనకు తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ కు బ్రూక్ క్షమాపణలు తెలిపాడు.

బ్రూక్ ఐపీఎల్ కంటే దేశానికే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చాడు. ఇంగ్లాండ్ క్రికెట్ పైనే ఆడడంపై తాను దృష్టి పెట్టినట్టు ఖరాఖండిగా చెప్పేశాడు. ఐపీఎల్ తర్వాత జూన్ నెలలో ఇండియాతో ఇంగ్లాండ్ ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ తో పాటు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ ఈ సిరీస్ పైనే బ్రూక్ తన పూర్తి దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News