Ben Stokes: బుమ్రా ఒక్కడు ఏం చేయలేడు

ఒక్కడు ఏం చేయలేడు;

Update: 2025-06-19 12:01 GMT

Ben Stokes: ఇండియా ,ఇంగ్లాండ్ మధ్య రేపటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంగ్లాండ్ బుమ్రాకు భయపడదని.. తమ ఆటగాళ్లు అతడిని ఎదుర్కొవడానికి పూర్తి సిద్ధంగా ఉన్నారన్నారు. ఒకే ఒక్క బౌలర్ జట్టుకు సిరీస్ అందిస్తాడని నేను ఎప్పుడు అనుకోనని.. జట్టులోని 11 మంది ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తేనే విజయం దక్కుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక్కడే విజయాన్ని అందిస్తాడని నేను నమ్మనని అన్నారు.

బుమ్రాపై ఇంగ్లాండ్ ప్రత్యేకంగా ఫోకస్ చేయడానికి కారణం టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్‌పై అతడికి అద్భుతమైన రికార్డ్ ఉండటమే. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ పేసర్లలో ఒకడైనా బుమ్రాను ఎదుర్కొవడం స్టోక్స్ సేనకు అంత సులువైన పనికాదు. బుమ్రా ఇంగ్లాండ్‌పై ఇప్పటి వరకు 14 టెస్టులు ఆడి 60 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ గడ్డపై అయితే బుమ్రా గణాంకాలు వేరే లెవల్. ఇప్పటి వరకు ఇంగ్లాండ్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన పేసర్ 37 వికెట్లు పడగొట్టాడు. మరీ ఈ సిరీస్‎లో బుమ్రా ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. ఇంగ్లీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడతాడా లేక బజ్ బాల్ క్రికెట్ ముందు తేలిపోతడా చూడాలి. 

Tags:    

Similar News