Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కుమార్ వరల్డ్ రికార్డ్
వరల్డ్ రికార్డ్
Bhuvneshwar Kumar: స్టార్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించి చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఏప్రిల్ 30 (గురువారం) జరిగిన మ్యాచ్‌లో ఆయన ఒక అద్భుతమైన ఘనతను సాధించారు. భారతదేశం (India) వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లలో 200 వికెట్లు తీసిన ప్రపంచంలోనే మొట్టమొదటి బౌలర్‌గా భువీ రికార్డు నెలకొల్పారు.
గుజరాత్ టైటాన్స్,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకోవడానికి భువనేశ్వర్‌కు రెండు వికెట్లు అవసరమయ్యాయి. మ్యాచ్ మొదలైన ఐదు ఓవర్లలోనే ఆయన ఈ లక్ష్యాన్ని పూర్తి చేశారు.
గుజరాత్ ఇన్నింగ్స్ 3వ ఓవర్ చివరి బంతికి సాయి సుదర్శన్‌ను అవుట్ చేసి తన 199వ వికెట్ ఖాతాలో వేసుకున్నారు. 5వ ఓవర్ చివరి బంతికి ప్రమాదకరమైన బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను విరాట్ కోహ్లీ చేతికి చిక్కేలా చేసి, తన 200వ వికెట్‌తో సరికొత్త చరిత్ర సృష్టించారు.
ఆ తర్వాత అదే జోరులో జోస్ బట్లర్‌ను కూడా అవుట్ చేసి తన వికెట్ల సంఖ్యను మరింత పెంచుకున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో 'పర్పుల్ క్యాప్' (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) రేసులో భువనేశ్వర్ ముందంజలో ఉన్నారు. ఈ జాబితాలో భువీ తర్వాత యుజ్వేంద్ర చహల్ 186 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు పూణే వారియర్స్ ఇండియా, సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు ఆర్‌సీబీ జట్ల తరపున ఆడిన భువనేశ్వర్, భారత్‌లో ఆడిన మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించడం విశేషం.