Rishabh Pant: న్యూజిలాండ్ పర్యటనకు ముందే భారత్‌కు బిగ్ షాక్.. రిషభ్ పంత్ ఆడేది అనుమానమే..
రిషభ్ పంత్ ఆడేది అనుమానమే..
Rishabh Pant: న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరనున్న భారత్-A జట్టుకు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. కివీస్ పర్యటనలో జరగనున్న 3 మ్యాచ్‌ల రెడ్ బాల్ సిరీస్ కోసం బీసీసీఐ సెలక్టర్లు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను ఎంపిక చేసినప్పటికీ.. అతడు ఈ మ్యాచ్‌లలో బరిలోకి దిగడంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఇటీవల తలెత్తిన ఫిట్‌నెస్ సమస్యల కారణంగా పంత్ న్యూజిలాండ్ టూర్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న పంత్
ముందుగా రిషభ్ పంత్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నాడని, వారం రోజుల్లో ప్రాక్టీస్‌లోకి వస్తాడని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం పంత్ తీవ్రమైన వెన్నునొప్పి (బ్యాక్ స్పాజమ్)తో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఇరానీ కప్ మ్యాచ్ సందర్భంగా అతడి వీపు భాగంలో కండరాల పట్టేత సమస్య తలెత్తింది. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కనీసం 10 నుంచి 15 రోజుల విశ్రాంతి అవసరమని వైద్య బృందం భావిస్తోంది.
ఫిట్‌నెస్ ఆధారంగానే ఎంపిక.. కానీ..
న్యూజిలాండ్‌తో జరగనున్న కీలక సిరీస్‌కు సంబంధించి పంత్ ఎంపిక మొదటి నుంచీ అతడి ఫిట్‌నెస్‌కు లోబడే జరిగింది. ఇప్పుడు వెన్నునొప్పి సమస్య తోడవడంతో అక్టోబర్ 24న ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ సమయానికి అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడం కష్టంగా మారింది. ఒకవేళ అతడు 10-15 రోజుల్లో కోలుకున్నా, మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం అనుమానంగానే కనిపిస్తోంది.
చివరి మ్యాచ్‌కైనా బరిలోకి దిగుతాడా?
భారత్-A, న్యూజిలాండ్-A మధ్య జరిగే 3 మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ నవంబర్ 7 నుంచి జరగనుంది. పంత్ అనుకున్న సమయానికి కోలుకుని ఫిట్‌నెస్ పరీక్ష పాసయితే.. కనీసం చివరి మ్యాచ్ నాటికైనా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే కీలక అంతర్జాతీయ టెస్ట్ సిరీస్‌ల దృష్ట్యా మేనేజ్‌మెంట్ పంత్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని యోచిస్తోంది.