Boxing: బాక్సింగ్ లో మరో ఏడు మెడల్స్ ఖాయం
ఏడు మెడల్స్ ఖాయం;
Boxing: ప్రస్తుతం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా అండర్-19 మరియు అండర్-22 బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు.భారత మహిళా బాక్సర్లు సత్తా చాటుతున్నారు. అండర్-19 విభాగంలో ఏడుగురు భారత మహిళా బాక్సర్లు సెమీఫైనల్స్‌కు చేరుకుని పతకాలను ఖాయం చేసుకున్నారు.
సెమీస్‌కు చేరిన భారత బాక్సర్లు:
యక్షిక (51 కేజీలు)
నిషా (54 కేజీలు)
ముస్కాన్ (57 కేజీలు)
విని (60 కేజీలు)
నిషా (65 కేజీలు)
ఆకాంక్ష ఫలస్వాల్ (70 కేజీలు)
ఆర్తి కుమారి (75 కేజీలు)
పురుషుల విభాగంలో కూడా భారత యువ బాక్సర్లు శివం (55 కేజీలు) , మౌసమ్ సుహాగ్ (65 కేజీలు) తమ బౌట్లలో విజయం సాధించి ముందంజ వేశారు. ఈ టోర్నమెంట్లో భారత్ తరపున మొత్తం 40 మంది బాక్సర్లు పాల్గొంటున్నారు.ఈ టోర్నమెంట్ యువ బాక్సర్లకు అంతర్జాతీయ స్థాయిలో తమ నైపుణ్యాలను ప్రదర్శించుకోవడానికి ఒక మంచి వేదికగా నిలుస్తుంది.