FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో ఐదుసార్లు ఛాంపియన్ బ్రెజిల్‌కు ఊహించని షాక్. లీగ్ తొలి మ్యాచ్‌లోనే సాంబా కింగ్స్‌ను మొరాకో జట్టు ముప్పుతిప్పలు పెట్టి.. వన్‌-వన్‌ (1-1)తో నిలువరించింది.

మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో నెయ్‌మార్ లేని లోటు బ్రెజిల్‌కు స్పష్టంగా కనిపించింది. ఆట మొదలైన 21వ నిమిషంలోనే మొరాకో ప్లేయర్ ఇస్మాయిల్ సైబారి వండర్ గోల్‌తో బ్రెజిల్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. తొలి అరగంటలో మొరాకో ఏకంగా 12 సార్లు బ్రెజిల్ గోల్ పోస్ట్‌పై దాడి చేసి మ్యాచ్‌ను ఊపేసింది.

"అయితే 32వ నిమిషంలో స్టార్ ప్లేయర్ వినీషియస్ జూనియర్ తన సమయస్ఫూర్తితో గోల్ కొట్టి బ్రెజిల్‌ను ఓటమి నుంచి కాపాడాడు. ఆఖరి నిమిషాల్లో బ్రెజిల్ గోల్ కీపర్ అలిస్సన్ గోడలా అడ్డు నిలవడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.ఈ డ్రాతో వరల్డ్‌కప్ ఓపెనింగ్ మ్యాచ్‌ల్లో 1934 తర్వాత ఇప్పటివరకు ఓడిపోని రికార్డును బ్రెజిల్ నిలబెట్టుకుంది.

Tags: