Trending News

BWF Championship: BWF చాంపియన్ షిప్: క్వార్టర్స్ సింధు ఓటమి

క్వార్టర్స్ సింధు ఓటమి

Update: 2025-08-30 12:06 GMT

BWF Championship: 2025 BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు ప్రయాణం క్వార్టర్ ఫైనల్స్‌లో ముగిసింది. ఆమె శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్ధాని చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమితో ఆమెకు ఈ టోర్నమెంట్‌లో పతకం దక్కలేదు.

అయితే, ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆమె ప్రదర్శన అద్భుతంగా ఉంది. ప్రపంచ నెంబర్ 2 వాంగ్ జీ యీని ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఈ టోర్నమెంట్‌లో ఆరో పతకం సాధించి రికార్డు సృష్టించాలనే ఆమె ఆశలు ఈసారికి ఆవిరయ్యాయి. పీవీ సింధు ఇప్పటి వరకు BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఐదు పతకాలు సాధించారు

2019లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె జపాన్‌కు చెందిన నొజోమి ఒకుహారాను ఓడించి గోల్డ్ మెడల్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు. 2017లో ఫైనల్‌లో నొజోమి ఒకుహారాతో ఓడిపోయి సిల్వర్ సాధించారు. 2018లో ఫైనల్‌లో కరోలినా మారిన్‌తో ఓడిపోయి మరో సిల్వర్ సాధించారు.2013లో మొదటిసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకున్నారు.2014లో కూడా ఆమె కాంస్య పతకం సాధించారు.

Tags:    

Similar News