BWF World Championships- 2025: ఇవాళ్టి నుంచే BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్
BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్;
BWF World Championships- 2025: BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్- 2025 టోర్నమెంట్ ఇవాళ్టి నుంచే ప్రారంభమైంది. పారిస్, ఫ్రాన్స్ వేదికగా ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇది 29వ BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్.
ఈ టోర్నమెంట్‌లో భారతదేశం తరపున పతకాల కోసం షట్లర్లు పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్ పోరాడనున్నారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు బరిలోకి దిగనుంది. ఐదు వరల్డ్‌చాంపియన్‌షిప్ పతకాలతో అత్యంత విజయవంతమైన ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన సింధు.. బల్గేరియాకు చెందిన కలోయాన నల్బంటోవాతో తొలి మ్యాచ్ ఆడుతుంది.
పురుషుల డబుల్స్ లో సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి, హరిహరన్-రూబన్ కుమార్. మహిళల డబుల్స్ లో ప్రియా కొంజెంగ్‌బమ్-శ్రుతి మిశ్రా, రుతపర్ణ పాండా-శ్వేతపర్ణ పాండా ఆడనున్నారు. మిక్స్‌డ్ డబుల్స్ లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో, రోహన్ కపూర్-రుత్విక గాద్దె ఆడనుంది. భారత షట్లర్లు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఛాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధిస్తున్నారు. 2011 నుంచి ప్రతి BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ కనీసం ఒక పతకం సాధిస్తూ వస్తోంది. ఈ సారి కూడా భారత షట్లర్ల నుంచి పతకాలు ఆశిస్తున్నారు.