BWF World Championships: BWF వరల్డ్ చాంపియిన్ షిప్..క్వార్టర్ ఫైనల్ కు సింధు
క్వార్టర్ ఫైనల్ కు సింధు;
BWF World Championships: ప్రస్తుతం పారిస్‌లో జరుగుతున్న 2025 BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నారు. ప్రపంచ నంబర్ 2 వాంగ్ జీ యీని ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఆమె ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఒక్క గేమ్ కూడా ఓడిపోకుండా ముందుకు సాగుతున్నారు. క్వార్టర్ ఫైనల్‌లో ఆమె ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్ధానితో తలపడనున్నారు.
పీవీ సింధు ఇప్పటికే ఈ మెగా టోర్నీలో ఐదు పతకాలు సాధించింది. ఆరోసారి మెడల్ నెగ్గి సిక్సర్ కొట్టేందుకు అడుగు దూరంలో ఉంది. 2019లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె జపాన్‌కు చెందిన నొజోమి ఒకుహారాను ఓడించి గోల్డ్ మెడల్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు.
2017లో ఫైనల్‌లో నొజోమి ఒకుహారాతో ఓడిపోయి సిల్వర్ సాధించారు. 2018లో ఫైనల్‌లో కరోలినా మారిన్‌తో ఓడిపోయి మరో సిల్వర్ సాధించారు.2013లో మొదటిసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకున్నారు.2014లో కూడా ఆమె కాంస్య పతకం సాధించారు.