Captain Shubman Gill: మా టార్గెట్ 2027 వరల్డ్ కప్..

2027 వరల్డ్ కప్..

Update: 2026-03-16 06:03 GMT

Captain Shubman Gill: బీసీసీఐ న్యూఢిల్లీలో నిర్వహించిన 'నమన్ అవార్డ్స్' (Naman Awards 2026) వార్షికోత్సవ కార్యక్రమంలో భారత స్టార్ బ్యాటర్, వన్డే ,టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 2024-25 సీజన్‌కు గానూ ఆయనకు ప్రతిష్టాత్మకమైన 'పాలీ ఉమ్రిగర్' (ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ - పురుషులు) అవార్డు లభించింది.

ఈ సందర్భంగా మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. గత ఏడాది భారత క్రికెట్ సాధించిన విజయాలు అద్భుతం. ఒకే ఏడాదిలో ఐదు ఐసీసీ ట్రోఫీలు (ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్, అండర్-19 వరల్డ్ కప్ మొదలైనవి) గెలవడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇది మా జట్టు సభ్యుల సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది.2023 వన్డే ప్రపంచకప్ ఓటమిని గుర్తుచేసుకుంటూ.."అప్పట్లో మేము విజయానికి చాలా దగ్గరగా వచ్చి ఆగిపోయాము. అది ఇప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అందుకే 2027 వన్డే ప్రపంచకప్ గెలవడమే మా తదుపరి ప్రధాన లక్ష్యం అని గిల్ స్పష్టం చేశారు.

భారత క్రికెట్ దిగ్గజాలు అందుకున్న ఈ ప్రతిష్టాత్మక అవార్డును రెండోసారి అందుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నన్ను గుర్తించినందుకు బీసీసీఐకి ధన్యవాదాలు. నా ఈ ప్రయాణంలో నిరంతరం అండగా నిలిచిన నా తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు.

ఈ అవార్డు రావడానికి గిల్ ప్రదర్శించిన అద్భుత ఫామ్ ప్రధాన కారణం. ఇంగ్లాండ్ పర్యటనలో 5 టెస్టుల్లో 754 పరుగులు సాధించారు (సగటు 75.40). ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించారు. సీజన్ మొత్తం కలిపి 490 పరుగులు చేశారు. 2025 క్యాలెండర్ ఇయర్ లో అన్ని ఫార్మాట్లు కలిపి 1,764 పరుగులు సాధించి ప్రపంచంలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు.

Tags:    

Similar News