Captain Suryakumar Yadav: సూర్య భవిష్యత్తుపై నీలినీడలు
నీలినీడలు
Captain Suryakumar Yadav: టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత కీలక దశలో ఉన్నారా? బ్యాటర్‌గా అతని ఫామ్ ఆందోళన కలిగిస్తుండటంతో.. సూర్య భవిష్యత్తుపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి.ప్రధానంగా 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ అరంగేట్రం చేయబోతున్న తరుణంలో.. ఆ జట్టులో సూర్యకు చోటు దక్కుతుందా లేదా అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో జూన్-జులైలో జరగబోయే ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లు సూర్యకు 'డూ ఆర్ డై' లాంటివి. ప్రస్తుతం సెలెక్టర్ల దృష్టి సూర్య కెప్టెన్సీ కంటే.. అతని బ్యాటింగ్ ఫామ్‌పైనే ఎక్కువగా ఉంది.
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు ఉన్నప్పటికీ.. 2028 నాటికి సూర్య వయసు 38 ఏళ్లకు చేరుకుంటుంది. వయసు రీత్యా అతన్ని కొనసాగించాలా? వద్దా? అనే సందిగ్ధంలో సెలెక్షన్ కమిటీ ఉంది. 2025లో ఘోరంగా విఫలమైన సూర్య.. ఈ ఏడాది కాస్త పుంజుకున్నట్లు కనిపించినా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ వంటి కీలక జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో, ముఖ్యంగా ఫైనల్లో విఫలం కావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
ఒకవైపు సీనియర్ల ఫామ్ ఆందోళన కలిగిస్తుంటే.. మరోవైపు కుర్రాళ్లు దూసుకొస్తున్నారు. సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. యువ రక్తాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉన్న బోర్డు.. ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోతోంది? సూర్య తన బ్యాట్‌తో మళ్ళీ సమాధానం చెప్తారా? లేక కొత్త తరం కోసం తప్పుకుంటారా? అన్నది వేచి చూడాలి.