HCA President : హెచ్‌సీఏపై చీటింగ్‌, ఫోర్జరీ కేసులు నమోదు చేసిన సీఐడీ

అధ్యక్షుడు జగన్మోహనరావుతో పాటు ఆపీస్‌ బేరర్ల అరెస్ట్‌;

Update: 2025-07-10 08:09 GMT

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డితో పాటు ఆఫీసు బ్యారర్ల అందరిని సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యాన్ని టిక్కెట్ల విషయంలో బ్లాక్‌ మెయిల్‌ చేశారనే ఆరోపణతో పాటు, హెచ్‌సీఏలోకి ఎంటర్‌ అవ్వడానికి హైదరాబాద్‌ గౌలిగూడలోని శ్రీచక్ర క్లబ్‌లో సభ్యుడిగా ఫోర్జరీ సంతకాలు చేసినట్ల వచ్చిన ఫిర్యాదుపై సీఐడీ కేసులు నమోదు చేసి అరెస్టులు చేసింది. గత ఐపీఎల్‌ మ్యాచ్‌ ల సందర్భంగా హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్‌ ల మధ్య టిక్కెట్ల విషయలో వివాదం నెలకొంది. తమకు టిక్కెట్లు కేటాయించలేదని ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలోని కార్పొరేట్‌ బాక్సుకు హెచ్‌సీఏ తాళం వేసింది. దీంతో తాము హైదరాబాద్‌ వదిలి వెళ్లిపోతామని ఆ సందర్భంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రకటన చేసింది. ఈవిషయంలో విచారణ చేసిన విజిలెన్స్‌ అధికారులు కూడా హెచ్‌సీఏ అధ్యక్షుడు స్వయంగా ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛాయిజీపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు తేల్చింది. హైదరాబాద్‌ లో మ్యాచ్‌ జరిగినప్పుడల్లా హెచ్‌సీఏకి పది శాతం టిక్కెట్లను ఉచితంగా ఎస్‌ఆర్‌హెచ్‌ ఇస్తుంది. అయితే దీనికి అదనంగా మరో పది శాతం టిక్కెట్లు ఇవ్వాలని హెచ్‌సీఏ తీవ్ర స్ధాయిలో ఒత్తిడి తెచ్చినట్లు విజిలెన్స్‌ విచారణలో నిర్ధారణ అయ్యింది. దీంతో హెచ్‌సీఏపై చర్యలకు విజిలెన్స్‌ ఆదేశించింది. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా సీఐడీ జగన్మోహనరావుపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసింది. దీంతో పాటు గౌలిగూడలో ఉన్న శ్రీచక్ర క్లబ్‌ కు అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి క్రిష్ణ యాదవ్‌ సంతకాన్ని ఫోర్జరీ చేయించి యాజమాన్య హక్కులను బదలాయించుకున్నారని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ధరమ్‌ గురువారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు జగన్మోహనావుతో పాటు ఆయన తమ్ముడు, మరదలిపై కూడా కేసు నమోదు చేసిన సీఐడీ వారిని కూడా అరెస్ట్‌ చేసింది. మోసం, నిధుల దుర్వినియోగం, పత్రాలను ఫోర్జరీ చేసిన వ్యవహారంలో హెచ్‌సీఏ అధ్యక్షుడితో పాటు ఆఫీసు బేరర్లపై Cr.No. 02/2025 U/s 465, 468, 471, 403, 409, 420 r/w 34 IPC ఆఫ్ CID, PS, తెలంగాణ, హైదరాబాద్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News