Telugu Cricketer Sri Charani: తెలుగు క్రికెటర్ శ్రీ చరణికి చంద్రబాబు బంపర్ ఆఫర్
శ్రీ చరణికి చంద్రబాబు బంపర్ ఆఫర్
Telugu Cricketer Sri Charani: తెలుగు క్రికెటర్ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 విజేతగా నిలిచిన భారత జట్టులో కడప జిల్లాకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన శ్రీచరణి కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా శ్రీ చరణి, మిథాలీ రాజ్, క్రికెట్ జట్టు క్రీడాకారులు సంతకం చేసిన టీ-షర్టును ముఖ్యమంత్రికి బహూకరించారు.
శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 2.5 కోట్లు నగదు, గ్రూప్-1 అధికారి స్థాయి ఉద్యోగం, కడపలో 1,000 చదరపు గజాల (Sq. Yard) ఇంటి స్థలం కేటాయించారు. శ్రీచరణి తన అద్భుతమైన ప్రదర్శనతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని, ఆమె విజయం రాష్ట్ర యువతకు స్ఫూర్తినిస్తుందని చంద్రబాబుఈ సందర్భంగా కొనియాడారు.